Gold Rates: అస్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.! 1 y ago

featured-image

8K News-15/03/2025 బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయి ఎవరు చెప్పలేరు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు.. డాలర్ విలువలు..దిగుమతి పన్నులు.. పండుగలు.. పెళ్లిళ్లు వంటి కారణాలవల్ల పసిడి ధరలు తరుచు మారుతుంటాయి. నిన్న పసిడి 10 గ్రాములు వెయ్యి రూపాయలకి పైగా పెరగగా.. ఇవాళ (శనివారం) అదే 10 గ్రాములపై ₹100 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,200 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.89,670 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయంలో కేజీ వెండి ధర రూ.1,12,000 వద్ద స్థిరంగా ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD